AP: వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కోసం పనిచేస్తూ చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. వైసీపీలో వివిధ కమిటీల్లో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక సాయం.ఇవ్వనున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఆర్థిక సాయం అందించనున్నట్లు వైసీపీ తాజాగా ప్రకటించింది.