వైసీపీలో జగన్ భారీ ప్రక్షాళన?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో ఇన్‌ఛార్జ్‌ల పనితీరు సరిగ్గా లేదని, క్యాడర్‌కు సహకరించలేదని ఫిర్యాదులు రావడంతో పార్టీలో భారీ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారు. సుమారు 60-70 మంది ఇన్‌ఛా2ర్జ్‌లపై వేటు వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రానున్న పంచాయతీ ఎన్నికలను యాసిడ్ టెస్ట్ గా భావిస్తున్న అధిష్టానం, ఫలితాల ఆధారంగా సంక్రాంతి తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోనుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕