మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలను కట్టడి చేసే క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్ నెల్లూరు వెళ్లారు. కాసేపట్లో ఆయన జైలుకు చేరుకొని గోవర్ధన్ రెడ్డిని కలవనున్నారు. ఈ సందర్భంగా 900 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.