మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై గవర్నర్‌కు జగన్ వినతి

AP: వైఎస్‌ జగన్‌ డిసెంబర్‌ 18న సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో భేటీ కానున్నారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి సంబంధించిన పత్రాలను గవర్నర్‌కు అందజేయనున్నారు. ఈ భేటీలో జగన్‌ వెంట పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, ఎంపీలు కూడా ఉంటారు. దీనికి ముందు ఉదయం 10 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల పత్రాలు నిండిన వాహనాలను జగన్‌ జెండా ఊపి రాజ్‌ భవన్‌కు పంపనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్