పులివెందులలో జగన్ మూడు రోజుల టూర్!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివేందులలో మూడు రోజులు పాటు పర్యటించనున్నారు. మంగళవారం సాయంత్రం పులివెందుల చేరుకుని, క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారు. బుధవారం ఉదయం పులివెందుల వాసవి ఫంక్షన్‌ హాల్‌లో జరిగే వివాహానికి హాజరై, అనంతరం బ్రహ్మణపల్లిలో అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. ఈ మూడు రోజుల పర్యటన షెడ్యూల్‌ను వైసీపీ అధికారికంగా విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్