జగన్ పర్యటన.. వైసీపీ కుట్ర బయటపెట్టిన డ్రోన్ వీడియో

AP: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైఎస్‌ జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ డ్రామా చేసిందని టీడీపీ ఆరోపించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. జగన్ వచ్చే సమయానికి తోటల నుంచి మామిడి లోడ్లతో ఉన్న ట్రాక్టర్లను తీసుకొచ్చి, రోడ్డుపై మామిడ్లు పారబోసి హంగామా చేశారని పేర్కొంది. ఇది వైసీపీ ఈవెంట్ పాలిటిక్స్ పథకం అని టీడీపీ విమర్శించింది. ఆ తోట, ట్రాక్టర్లు చిత్తూరు వైసీపీ నేతలవి అని పేర్కొంది.

సంబంధిత పోస్ట్