లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికే జగన్ బంగారుపాళ్యం పర్యటనకు వెళ్లారని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ‘రాష్ట్రంలో రైతులకు ఎలాంటి సమస్యలు ఉండకూడదనే దిశగా పాలన సాగిస్తున్నాం. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి అధికారం అప్పగించారు. రాష్ట్రంలో ఎలాంటి సమస్య వచ్చినా.. ముందుగానే ప్రభుత్వం స్పందిస్తోంది. పోలీసు అధికారుల పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు’ అని మండిపడ్డారు.