AP: వైసీపీ అధినేత జగన్ పర్యటన నేపథ్యంలో గురువారం నెల్లూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ మేరకు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని జగన్ కాసేపట్లో కలవనున్నారు. అయితే భారీగా ప్రజలు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. ప్రధాన రహధారులలో 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 900 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.