AP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం, బుధవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు పులివెందులకు చేరుకుని భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం పులివెందులలోనే బస చేయనున్నారు. బుధవారం ఉదయం ఇడుపులపాయకు వెళ్లి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం అక్కడ నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని తిరుగు ప్రయాణం కానున్నారు.