నెల్లూరు జైల్లో ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించేందుకు గురువారం మాజీ సీఎం జగన్ వెళ్లిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి టీడీపీ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరలవుతోంది. జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ యూట్యూబ్ ఛానల్లో మార్ఫింగ్ వీడియోను ప్రసారం చేశారని ట్రోల్ చేస్తున్నారు. నెల్లూరు పర్యటనకు కార్యకర్తలు రాకపోవడంతో.. చిత్తూరులోని బంగారుపాళ్యం పర్యటన వీడియోను ప్రసారం చేసినట్లు చెబుతున్నారు.