నెల్లూరులో నేడు జగన్ పర్యటన

AP: వైసీపీ అధినేత జగన్ నేడు నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నెల్లూరు చేరుకుంటారు. జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలవనున్నారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడుతారు. ఆ తర్వాత మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి.. ఇటీవల ఆయన ఇంటిపై జరిగిన దాడి, తదితర అంశాలపై చర్చించచనున్నారు. కాగా జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్