AP: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 15వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. భీమవరంలో ఆక్వా రంగం సంక్షోభంపై రైతులు, రైతు నేతలతో ఆయన సమావేశమవుతారు. ఈ విషయాన్ని పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆదివారం, జూలై 5వ తేదీన వెల్లడించారు. కూటమి పాలనలో ఆక్వా రంగం సంక్షోభంలోకి వెళ్లిందని, ప్రభుత్వం ఫీడ్ వ్యాపారులకు మద్దతు పలుకుతోందని, కరెంటు సబ్సిడీ తొలగించి రైతులపై భారం వేసిందని ప్రసాదరాజు ఆరోపించారు.