AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 15వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆక్వా రంగం సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో భీమవరంలోని రైతులు, రైతు నేతలతో సమావేశమవుతారు. ఈ విషయాన్ని పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆదివారం వెల్లడించారు. కూటమి పాలనలో ఆక్వా రంగం సంక్షోభంలోకి వెళ్లిందని, ప్రభుత్వం ఫీడ్ వ్యాపారులకు మద్దతు పలుకుతోందని, కరెంటు సబ్సిడీ తొలగించి రైతులపై భారం వేసిందని ప్రసాదరాజు ఆరోపించారు.