రాజీ బాటలో జగన్ - షర్మిల?

AP: 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ జగన్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తల్లి విజయమ్మ చొరవతో సోదరి షర్మిలతో ఆర్థిక వ్యవహారాలు సర్దుబాటు అయినట్లు సమాచారం. బెంగళూరు కేంద్రంగా రాజకీయ పరిణామాలు జరిగే అవకాశం ఉంది. జగన్ 'మిషన్ 2029'ను ప్రారంభించి, పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకునే యోచనలో ఆయన ఉన్నారు. తల్లి విజయమ్మ చొరవతో ఇద్దరి మధ్య కీలక అంశాల పైన రాజీ కుదిరిందని.. ఇక రాజకీయ అంశాల పైన మాత్రం తేలాల్సి ఉందని చెబుతున్నారు. కొంత కాలంగా జగన్ పైన షర్మిల రాజకీయంగా దూకుడు తగ్గించారు. అయితే, ఈ రాజీ చర్చలు.. ఇద్దరి మధ్య సయోధ్య పైన అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕