AP: మెగా డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేసిన వైసీపీ అధినేత జగన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి లోకేశ్ డిమాండ్ చేశారు. అభ్యర్థుల్లో అనవసర ఆందోళన కలిగించినందుకు వారికి క్షమాపణలు చెప్పాలన్నారు. జగన్ చేసేవి అబద్ధపు ప్రచారాలని, ఆయన ఆరోపణలను వాస్తవాలతో గట్టిగా తిప్పికొట్టామన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ఓ వీడియోను షేర్ చేశారు.