AP: తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో రసాయనాలు వాడారని, వైఎస్ఆర్ నుంచి జగన్ వరకూ శ్రీవారిపై పగబట్టారని టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ ఆరోపించారు. వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా టెండర్ నిబంధనలు మార్చారని, దీనిపై వైవీ సుబ్బారెడ్డి సంతకాలు చేశారని ఆమె తెలిపారు. జంతుకొవ్వు అవశేషాలున్నట్లు NDDB నివేదికలో ఉందని, ఇది కేవలం కుంభకోణం కాదని, హిందుత్వంపై దాడి అని అనురాధ అన్నారు. కల్తీ లడ్డూల తయారీకి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.