AP: చంద్రబాబు ప్రభుత్వ పాలనపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమం విజయవంతం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు విఫలమయ్యారని, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ప్రతి కుటుంబాన్ని మోసం చేశారని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధికి బదులు అబద్ధాల ప్రచారం, సంక్షేమానికి బదులు మోసం, ప్రజాపాలనకు బదులు కక్షసాధింపులు, అరాచకాలు రాజ్యమేలుతున్నాయని దుయ్యబట్టారు.