AP: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం మఠంగూడెంకు చెందిన వైసీపీ కార్యకర్త కె.నాగబాబు తన కుమార్తె సహర్షితకు జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించారు. జగన్ చిన్నారి చేయి పట్టుకుని ఏ, బీ, సీ, డీ రాయించారు. అనంతరం చిన్నారిని ముద్దాడారు.