నేడు అనంతపురం నేతలతో జగన్ భేటీ

AP: వైసీపీ అధినేత జగన్ నేడు అనంతపురం జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. వరుసగా జిల్లాల నేతలతో సమావేశమవుతున్న జగన్.. తమ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. వచ్చే నెల మూడోవారం నుంచి జగన్ జిల్లాల పర్యటన ఉండనుండటంతో ముందుగానే జిల్లా నేతలతో ఆయన సమావేశమవుతున్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఛైర్మన్లు హాజరుకానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్