AP: కాసేపట్లో అంబటి రాంబాబు నివాసానికి వైసీపీ అధినేత జగన్ చేరుకోనున్నారు. జగన్ కాన్వాయ్ భారీ జనం మధ్యలోంచి నెమ్మదిగా ముందుకు సాగుతోంది. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుటిల యత్నం చేస్తోందని వైసీపీ ఆరోపించింది. ఆంక్షలను దాటుకుని జగన్‌ను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారని పేర్కొంది. జంగిల్ రాజ్‌కు వ్యతిరేకంగా.. జగన్ వెంటే తామంటూ జనం నినాదాలు చేశారు.