AP: పోలీసులకు జగన్ వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన పోలీస్ అధికారులను చట్టం ప్రకాశం శిక్షిస్తామన్నారు. బుధవారం తాడేపల్లిలో జగన్ మాట్లాడుతూ.. ‘వైసీపీ నేతలపై పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారు. తప్పు చేసిన వారిని వడిచిపెట్టి, వైసీపీ నేతలనే టార్గెట్ చేస్తున్నారు. పోలీసులకు వైసీపీ కార్యకర్తలు ఒక్కటే చెప్పండి. చాలా ఫాస్ట్గా టైం, చక్రం తిరుగుతుంది. మరో రెండేళ్ల తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు డిజిటల్ డైరీ ఓపెన్ చేసి అన్ని లెక్కలు తేలుస్తాం’ అని అన్నారు.