దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జగన్

AP: మాజీ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు దీపావళీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి జీవితాల్లో దీపావళి వేల కాంతులు నింపాలని ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్