సీబీఐ కోర్టుకు హాజరు విషయంలో జగన్మోహన్ రెడ్డి విముఖత

AP: అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరు కావడానికి జగన్మోహన్ రెడ్డి విముఖత చూపారు. తనకు మినహాయింపులు కావాలని కోరగా, సీబీఐ కోర్టు అనుమతి నిరాకరించింది. కోర్టుకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో, జగన్మోహన్ రెడ్డి ఈనెల 21న సీబీఐ కోర్టుకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. గతంలో బెయిల్ పై ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేవారు. సీఎం అయ్యాక మినహాయింపు లభించినా, ఇప్పుడు మరోసారి కోర్టుకు వెళ్ళనున్నారు. దీంతో కోర్టు ఎలా స్పందిస్తుందోనని వైసీపీలో ఆందోళన నెలకొంది.

సంబంధిత పోస్ట్