జగ్గయ్యపేట మున్సిపాలిటీ కూటమి కైవసం

AP: ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఎన్నికల ఫలితాల్లో భాగంగా టీడీపీ 14, జనసేన 5, బీజేపీ 1 స్థానాల్లో విజయం సాధించాయి. మరోవైపు వైసీపీ 3 స్థానాలకు పరిమితం కాగా, స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు.

సంబంధిత పోస్ట్

✕
✕