AP: ఏలూరు జిల్లా కైకలూరు పంచాయతీ శివారు దానగూడెంలో శనివారం వినాయక విగ్రహం ఊరేగింపులో దళితులపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దళితవాడకు చెందిన అజయ్ బైక్‌పై వస్తుండగా.. వినాయకుడి విగ్రహ ఊరేగింపు డీజే వాహనం అడ్డు వచ్చింది. అజయ్ హారన్ మోగించగా.. జనసేన కార్యకర్తలు దాడికి దిగారు. ఈ క్రమంలో దళితులు, కార్యకర్తల మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.