AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే మూడు, నాలుగు నెలల్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని పిఠాపురానికి మార్చనున్నట్లు వెల్లడించారు. పిఠాపురం నుంచే పార్టీ కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఆయన పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.