జ‌న‌సేన‌కు తిరువూరు సీటు.. టీడీపీ ఎమ్మెల్యే తిరుగుబాటు

AP: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సీటు జనసేనకు కేటాయించడంతో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరుగుబాటు మొదలుపెట్టారు. తన వర్గానికి చెందిన టీడీపీ మహిళతో ఆదివారం మున్సిపాలిటీ ఛైర్మన్ అభ్యర్థిగా నామినేషన్‌గా వేయించనున్నట్లు ఎమ్మెల్యే కొలికపూడి తెలిపారు. ‘రేపు ఉ.10 గంటలకు అయ్యప్ప స్వామి ఆలయం నుంచి తిరువూరు మున్సిపాలిటీ ఛైర్మన్ అభ్యర్థి పెనుబల్లి శ్రావణి నామినేషన్ ర్యాలీ. అందరికీ ఆహ్వానం’ అంటూ కొలికపూడి శనివారం వాట్సప్ స్టేటస్ పెట్టారు.

సంబంధిత పోస్ట్

✕
✕