AP: రాష్ట్రంలో పోలీసుల వైఖరి దారుణంగా ఉందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. కృష్ణలంక పీఎస్‌లో జరిగిన దారుణంపై ప్రభుత్వం, అధికారులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. పోలీసులే లాకప్ డెత్ చేసి చంపేశారని ఆరోపించారు. గొడ్డలి పార్టీ అంటూ కూటమి ప్రభుత్వం రెచ్చిపోతుందన్నారు. గొడ్డలి పార్టీతో తమకేం సంబంధం అని పేర్కొన్నారు. జనసైనికులు గొడ్డలితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెడతారన్నారు. జనసేన వాళ్లు అనాథ పిల్లలని, తెలుగుదేశం వాళ్లు అంతా చేసేస్తారని ఎద్దేవా చేశారు.