సీఐటీయూ నేతలతో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ దురుసు ప్రవర్తన.!

AP: విశాఖపట్నం నైట్ ఫుడ్ కోర్టు తొలగింపును నిరసిస్తూ సీఐటీయూ నేతలు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్‌కు వినతిపత్రం సమర్పించారు. అయితే, ఎమ్మెల్యే వినతిపత్రాన్ని స్వీకరించి, సమస్యను తెలుసుకున్న తర్వాత వెంటనే తిరిగి ఇచ్చేయడంతో ఆయన తీరుపై విమర్శలు వస్తున్నాయి. వినతిపత్రాన్ని విసిరివేసినట్లుగా వెనక్కి ఇవ్వడంపై సీఐటీయూ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్