రేపటితో ముగియనున్న జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం

జనసేన పార్టీలో గుర్తింపు, కమిటీల్లో స్థానం, కార్యకర్త నుండి నాయకుడిగా ఎదిగేందుకు ఉద్యమి సభ్యత్వం తప్పనిసరి అని జనసేన పార్టీ తెలిపింది. పార్టీ కోసం పనిచేసే జనసైనికుల జీవితాలకు భద్రత కల్పించేలా సభ్యత్వంతో పాటు ప్రమాద బీమా సదుపాయం కూడా కల్పించనున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు సభ్యత్వం నమోదు చేసుకోని వారు వెంటనే తమ సమీప సాధక్ లేదా స్థానిక నాయకులను సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏప్రిల్ 30తో ముగియనున్నట్లు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్