వచ్చే ఎన్నికల్లో అరకు పార్లమెంట్‌ పరిధిలోని అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది: నాగబాబు

AP: జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో అరకు పార్లమెంట్‌ పరిధిలోని అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని తెలిపారు. గిరిజనుల సంక్షేమం కోసమే పంచాయితీరాజ్‌శాఖను తీసుకున్నారని, గిరిజన హక్కుల పరిరక్షణకు జనసేన కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. బాక్సైట్‌, హైడ్రోపవర్‌ ప్రాజెక్టులపై తనకు అవగాహన లేదని, ప్రకృతికి నష్టం కలిగించే ఏ నిర్ణయాన్నైనా పవన్‌కల్యాణ్‌ ఆమోదించరని నాగబాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్