AP: కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ తన ఖాతా తెరిచింది. అమలాపురం, మలికిపురం మండలాల్లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన మూడు స్థానాల్లో విజయం సాధించింది. అమలాపురం మండలంలోని ఈదరపల్లి-1 స్థానం నుండి ఆకుల విజయలక్ష్మి, జానుపల్లి-వాకపల్లి నుండి శివ విజయం సాధించగా, ఇరుసుమండ స్థానం నుండి వలవల వెంకటమాణిక్యం గెలుపొందారు.