AP: ప్రత్తిపాడు జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు మరణానంతరం ఆ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై రాజకీయ చర్చలు తీవ్రమయ్యాయి. ప్రస్తుతం తమ్మయ్య బాబు తనయుడు, కత్తిపూడి శివ, ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు జనసేనలో చేరడంతో, ఆయనకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే బార్లపూడి క్రాంతి భవిష్యత్తుపై ఆసక్తి నెలకొంది. ఈ పరిణామం నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది.