విద్యార్థుల్లో కామెర్ల వ్యాప్తి కలకలం

AP: మన్యం జిల్లా కురుపాంలోని గిరిజన బాలికలు, ఏకలవ్య పాఠశాలల విద్యార్థుల్లో కామెర్ల వ్యాప్తి కలకలం రేపుతోంది. జిల్లావ్యాప్తంగా 635 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. 89 మందిలో కామెర్లు నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. విశాఖ కేజీహెచ్‌లో వైద్యుల పర్యవేక్షణలో బాధిత పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. కురుపాం గురుకులంలో సేకరించిన ఆహారం, నీటి నమూనాలను వైద్య బృందాలు ప్రాంతీయ ప్రయోగశాలకు తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్