AP: తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలను వేధించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారులను అరెస్ట్ చేయాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దారెడ్డి ఇంటికి వెళ్లేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నించారు. దాంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ర్యాలీల పేరుతో పెద్దారెడ్డి కవ్వింపు చర్యలకు దిగుతున్నారని జేసీ విమర్శించారు.