AP: మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (APREIS) 59వ గవర్నింగ్ బాడీ సమావేశంలో కీలక ప్రకటన చేశారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐఐటీ జేఈఈ/నీట్ అకాడమీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రెసిడెన్షియల్ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిభావంతులను తయారుచేసే కేంద్రాలుగా మార్చాలని పేర్కొన్నారు. అకడమిక్ ఎక్సలెన్స్ పై దృష్టి సారించాలని అధికారులకు, ఉపాధ్యాయులకు మంత్రి సూచించారు.