నకిలీ మద్యం కేసులో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు రాముకు బిగ్ షాక్ తగిలింది. వారిద్దరిని మరోసారి ఎక్సైజ్ పోలీసులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో విజయవాడ జైలు నుంచి వారిని ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు. లిక్కర్ కేసులో నిందితులు జనార్థన్ రావు, జగన్మోహన్ రావులకు జోగి బ్రదర్స్ సహకరించారనే ఆరోపణలపై పోలీసులు వారిని విచారిస్తున్నారు.