AP: మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు రాములకు నకిలీ మద్యం కేసుల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న వీరిద్దరినీ, అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో పీటీ వారెంట్‌పై తంబళ్లపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ధర్మాసనం వారిద్దరికీ 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో వారిని తిరిగి నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు.