కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర లేదు: భార్య శకుంతల

AP: కల్తీ మద్యం వ్యవహారంలో తన భర్త జోగి రమేశ్ పాత్ర లేదని, కావాలనే ఈ కేసులో తనను ఇరికించారని ఆయన భార్య శకుంతల అన్నారు. చంద్రబాబు ఇంటికి వెళ్లినప్పటి నుంచి ఆయన కొడుకు నారా లోకేశ్ కక్ష పెంచుకున్నాడన్నారు. గతంలో అగ్రిగోల్డ్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేశారన్నారు. ఇప్పుడు కల్తీ మద్యం అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేశామని, పైన దేవుడు అన్ని చూసుకుంటాడన్నారు.

సంబంధిత పోస్ట్