AP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నేతలు ఆయన ఇంటిపై దాడి చేయడంపై తాజాగా స్పందించారు. రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. ‘నా ఇంటిపై చంద్రబాబు, లోకేశ్ దాడి చేయించారు. తప్పుడు కేసులో 83 రోజులు జైల్లో పెట్టి రాక్షసానందం పొందారు. ఇప్పుడు నా కుటుంబాన్ని చంపాలని చూస్తున్నారా? లోకేశ్ గుర్తుంచుకో.. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో.. నీ ఇల్లూ నా ఇంటికి అంతే దూరం’ అని హెచ్చరించారు.