ఏపీ బీజేపీలో భారీ చేరికలు ఉంటాయని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన ప్రకటనతో వైసీపీలో ఆందోళన నెలకొంది. ఎన్నికల ముందు, తర్వాత చాలామంది నేతలు పార్టీని వీడగా, కూటమి పార్టీలో అవకాశం దక్కని వారే వైసీపీలో కొనసాగుతున్నారని తెలుస్తోంది. జనసేన కూడా చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీ వ్యతిరేక భావజాలం ఉన్న YCP సీనియర్ నేతలు, TDPలో చేరడానికి అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.