AP: మార్కాపురం జిల్లా, గిద్దలూరులో వైసీపీకి షాక్ తగిలింది. కొమరోలు మండలం దద్దవాడ పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ వైస్ సర్పంచ్ మునగాల వెంకటరెడ్డి, యల్లంపల్లి రామిరెడ్డి, జింకల రామాంజనేయరెడ్డి, ఎద్దుల తిరుపాల్ రెడ్డితో పాటు వారి అనుచరులు ఎమ్మెల్యే అశోక్ రెడ్డిసమక్షంలో టీడీపీలో చేరారు.