AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ నేడు(మంగళవారం) ఉమ్మడి ప్రెస్ మీట్‌లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నేతలు ప్రజలను కోరనున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించనున్నారు.