సమ్మెను విరమించిన జూనియర్ డాక్టర్లు

AP: గత 16 రోజులుగా చేపట్టిన సమ్మెను జూనియర్ డాక్టర్లు విరమించారు. సమ్మెను విరమిస్తున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. కాగా, జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕