AP: రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల సమ్మె మరింత ఉధృతంగా మారింది. రేపటి నుంచి అత్యవసర వైద్య సేవలు కూడా బహిష్కరించాలని నిర్ణయించింది. జూనియర్ డాక్టర్ల నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇన్ సర్వీస్, ప్రైవేట్ కాలేజీ పీజీలను వినియోగించుకోవాలని ఆదేశించింది. సెకండరీ ఆస్పత్రుల నుంచి కూడా డాక్టర్లను వినియోగించుకోవాలని సూచించింది. ఎమర్జెన్సీ, క్యాజువాల్టీ, ఐసీయూ సేవలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలంది.