ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కె.అంకారావు నియామకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అడవుల పెంపకం సలహాదారుగా కె.అంకారావును నియమించింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో అంకారావు రెండేళ్లు కొనసాగనున్నారు. కాగా పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన అంకారావు నల్లమల్ల అటవీ ప్రాంతానికి అంకితమైన సంరక్షకుడు. 2 లక్షల ఎకరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను ఆయన తొలగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్