AP: కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు చర్యగా ఎంపీని పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్కు తరలించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పీఎస్కు భారీగా వైసీపీ నేతలు చేరుకున్నారు. అంకాలమ్మ గూడూరులో ఎంపీ అవినాష్ రెడ్డి వాహనాలపై టీడీపీ అనుచరులు రాళ్లదాడికి పాల్పడటంతో పాటు పెట్రోలు బాంబులు విసిరారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సింహాద్రిపురంలో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వైసీపీ సానుభూతిపరులపై కూడా దాడి జరిగినట్లు సమాచారం.