జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గానికి మరో 5 సిమెంట్ పరిశ్రమలు రానున్నాయని తెలిపారు. సోమవారం పొన్నతోటలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జూలై 3న ముఖ్యమంత్రి చంద్రబాబు జెఎస్ డబ్ల్యు స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభిస్తారని, రెండేళ్లలో ప్లాంట్ పూర్తిచేయడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.