అట్లూరు: చెల్లి పెళ్లి వేడుకలకు వచ్చి.. ఆగిన అన్న గుండె

చెల్లెలి పెళ్లి కోసం నెల క్రితం కువైట్‌ నుంచి వచ్చిన షేక్ మహబూబ్బాషా (25) గురువారం అట్లూరు మండలంలోని మహమ్మద్ బాయపల్లెలో ఇంటి వద్ద అకస్మాత్తుగా కుప్పకూలి మృతిచెందారు. రెండేళ్ల క్రితం కువైట్‌లోని తండ్రి సిలార్సాహెబ్ సహాయంతో ఉద్యోగానికెళ్లాడు. మళ్లీ కువైట్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో గుండెపోటుతో మరణించారు. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్