బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండలంలో గురువారం భారీ భూకబ్జాను ఆర్డీఓ చంద్రమోహన్, పోలీసులు అడ్డుకున్నారు. మూలపల్లి పంచాయతీ సర్వే నెంబర్ 1 లో 100 ఎకరాలకుపైగా భూమిని కొందరు ఆక్రమించుకుని చదును చేస్తున్నారని గుర్తించారు. ఈ క్రమంలో 2 హిటాచీలు, ఒక జెసిబి, ఒక టిప్పర్ ను సీజ్ చేశారు. పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తాహసీల్దార్ కు ఆర్డీఓ చంద్రమోహన్ ఆదేశించారు.